Pudina Chutney : పుదీనా చట్నీ ఇలా తయారు చేసుకోండి
చిన్నప్పుడు చట్నీలు బాగా ఇష్టంగా తినే వాళ్ళం. కానీ ఇప్పుడు తినడం లేదు. టెక్నాలజీ మారిపోయే సరికి చట్నీలు తింటే వేడి చేస్తుందని ఎక్కువ తినడం లేదు. పుదీనా చట్నీ వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని అందరూ తినవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Pudina Chutney: చిన్నప్పుడు చట్నీలు బాగా ఇష్టంగా తినే వాళ్ళం. కానీ ఇప్పుడు తినడం లేదు. టెక్నాలజీ మారిపోయే సరికి చట్నీలు తింటే వేడి చేస్తుందని ఎక్కువ తినడం లేదు. పుదీనా చట్నీ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని అందరూ తినవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. వికారం లాంటి సమస్యలు ఉన్న వారికి పుదీనా చట్నీ మంచిగా పనిచేస్తుంది. ముందుగా దీనికి కావలిసిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు :
100 గ్రాముల తురిమిన పుదీనా
1 ఉల్లిపాయ
1 టీ స్పూన్ జీలకర్ర
2 టేబుల్ స్పూన్ల పంచదార
పచ్చిమిర్చి రెండు తీసుకోండి
1 కప్పు పెరుగు
తయారీ విధానం :
ముందుగా తురిమిన పుదీనాను ఒక గిన్నె లోకి తీసుకోండి. తరువాత ఇంకో గిన్నె తీసుకోని, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పంచదార, పచ్చిమిర్చి తీసుకోని, ఈ మిశ్రమాన్ని బాగా చేతితో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న తురిమిన పుదినాను మిక్సీ జార్ లోకి తీసుకోని గ్రైండ్ చేసుకోవాలి. వేరే గిన్నెలో కలుపుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమానికి ఒక కప్పు పెరుగు జోడించి, బాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోండి. అంతే పుదీనా చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.