Last Updated:

Karthik Deepam: సెప్టెంబర్ 19 ఏపిసోడులో కీలక నిర్ణయం తీసుకున్న సౌందర్య

బాబుని మీకు చూడాలనిపిస్తే నేనే తీసుకొచ్చి మీకు చూపిస్తానని గుచ్చి గుచ్చి ఎందుకు చెప్పింది. నేను అక్కడి వెళ్ళి బాబును చూస్తాను. ఆ మోనిత ఏం చేస్తుందో నేను చూస్తా అని సౌందర్య గట్టిగా అరిచి చెప్తుంది.

Karthik Deepam: సెప్టెంబర్ 19 ఏపిసోడులో కీలక నిర్ణయం తీసుకున్న సౌందర్య

Karthik Deepam:నేటి కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. మందు కోసం కార్తీక్, శివ ప్రశ్న వేసేసరికే దీప ఒక్కసారిగా అటువైపు కిటికీ దగ్గరకు వచ్చి కార్తీక్‌ని చూస్తూ ఉండిపోతుంది. శివతో ఈ విధంగా అంటాడు ‘అవునయ్యా నాకు వంటలక్క పేరు ఇప్పటికి ఎప్పటికి గుర్తుంటుంది. అలాగే తనతో మాట్లాడిన మాటలన్ని గుర్తుంటాయి. ఇవన్ని నాకు ఎందుకు గుర్తు ఉన్నాయో అర్థం కావట్లేదని అంటాడు. అప్పుడే అది విన్న దీప ఈ విధంగా మనసులో ‘అదే డాక్టర్ బాబు అనుబంధం అంటే’ అని అనుకుంటుంది. సరేలే కానీ హలో అటు ఇటు తెగ తిరుగుతున్నావ్ అని కార్తీక్ శివని అడుగుతాడు. శివ సార్ అంటూ చెప్పాలని ఆగిపోతుంటాడు “సార్ మీరు తిట్టను అంటే మీకు ఒకటి చెబుతానని శివ సార్ అని అంటాడు. దానికి సరే అంటాడు శివ. “అదే సార్, నాకు మందు అలవాటు కూడా ఉంది. ఎలాగో మీ మేడమ్ ఊరులో లేరు కదా. మందు ఇక్కడికి తెచ్చుకొని తాగుతాను సార్ ” అని కార్తీక్ శివతో అంటాడు.

నిర్ణయం తీసుకున్న సౌందర్య..

ఆనందరావు ‘నువ్వు ఎక్కువగా ఆలోచించకు సౌందర్య’ అని అంటాడు. ఐనా సౌందర్య వినిపించుకోకుండా కంగారూ పడుతూ ఉంటుంది. “ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. పైగా తను ఉంటోంది ఎక్కడా? వాళ్లు చనిపోయిన చోటే కదా. అక్కడికి లక్ష్మణ్ వాళ్లని ఎందుకు రావద్దు అంటుంది. మళ్లీ బాబుని తనే ఇచ్చేస్తాను అని ఎందుకు అన్నది. బాబుని మీకు చూడాలనిపిస్తే నేనే తీసుకొచ్చి మీకు చూపిస్తానని గుచ్చి గుచ్చి ఎందుకు చెప్పింది. నేను అక్కడి వెళ్ళి బాబును చూస్తాను. ఆ మోనిత ఏం చేస్తుందో నేను చూస్తా అని గట్టిగా అరిచి చెప్తుంది. ఇదంతా విన్న ఆనందరావు చివరికి సరేనని అంటాడు.

ఇవి కూడా చదవండి: