Daali Dhananjaya: ఓ ఇంటివాడైన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్
![Daali Dhananjaya: ఓ ఇంటివాడైన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/daali-dhanujay.jpg)
Daali Dhananjaya Tie Knot With Dhanyatha: ‘పుష్ప: ది రైజ్’ విలన్ డాలీ ధనుంజయ అలియాస్ జాల్‌రెడ్డి ఓ ఇంటివాడు అయ్యాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుకగా జరిగింది. డాక్టర్ ధన్యతతో ఆదివారం ఏడడుగులు వేశాడు. ఫిబ్రవరి 16న ఆదివారం ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం డాలీ ధనుంజయ్, ధన్యత పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఆయనకు నెటిజన్స్, అభిమానులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న గ్రౌండ్‌లో ఈ పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈపెళ్లికి కన్నడ ఇడస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. కాగా కన్నడలో హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు పొందాడు. అభిమానులంతా అతడిని ముద్దుగా ‘డాలీ’ అని పిలుచుకుంటారు. కన్నడలో స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన డాలీ ధనుంజయని సుకుమార్ పుష్ప పార్ట్ 1లో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఇందులో జాలీరెడ్డిగా విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు.