Last Updated:

Naga Chaitanya “NC22” Movie: పోలీస్ ఆఫీస‌ర్‌గా నాగచైతన్య… అక్కినేని అభిమానులకు పండుగే..!

టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ల‌వ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న నాగ‌చైత‌న్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే  చైతన్య ‘ధూత’ అనే హార‌ర్‌ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండ‌గానే నాగ‌చైత‌న్య త‌న తర్వాతి "NC22" చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

Naga Chaitanya “NC22” Movie:  పోలీస్ ఆఫీస‌ర్‌గా నాగచైతన్య… అక్కినేని అభిమానులకు పండుగే..!

Naga Chaitanya “NC22” Movie: టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ల‌వ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న నాగ‌చైత‌న్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫేయిల్యూర్‌గా మిగిలిపోయింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే  చైతన్య ‘ధూత’ అనే హార‌ర్‌ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండ‌గానే నాగ‌చైత‌న్య త‌న తర్వాతి “NC22” చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

ఇటీవ‌లే ‘మానాడు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన వెంక‌ట్ ప్ర‌భు డైరెక్షన్లో చైత‌న్య ఈ చిత్రాన్ని చేయ‌నున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ బిగ్ అప్‌డేట్‌ను డైరెక్టర్ వెంకట్ ప్రభు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ బుధ‌వారం ప్రారంభం కానున్న‌ట్లు ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ప్రేక్షకుల ముందు రిలీజ్ చేశారు.

ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తిని క్రియేట్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: Megastar Chiranjeevi: “నేను రాజకీయానికి దూరం కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అంటున్న చిరంజీవి

follow us

సంబంధిత వార్తలు