Last Updated:

Dilruba Trailer: దిల్ రుబా ట్రైలర్.. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా.. ?

Dilruba Trailer: దిల్ రుబా ట్రైలర్.. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా.. ?

Dilruba Trailer: క సినిమా తరువాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం దిల్ రుబా.  విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

 

దిల్ రుబా మార్చి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సారీ రా సిద్దు అని  ఒక అమ్మాయి చెప్పగా.. దానికి కిరణ్.. ” తప్పు చేసిన తరువాత చెప్పే సారీకి , అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కు నా దృష్టిలో వాల్యూ లేదు” అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది.

 

ట్రైలర్ లో  మొత్తం అన్ని ఎమోషన్స్ ను కవర్ చేశారు.  సిద్దు ఒక కాలేజ్ స్టూడెంట్. అతనికి సారీ, థాంక్స్ పదాలు నచ్చవు. తప్పు చేయకపోతే సారీ చెప్పకూడదు అనుకుంటాడు. కాలేజ్ లోనే సిద్దుకు ఒక బ్రేకప్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అతడి లైఫ్ లోకి మ్యాగీ వస్తుంది. సిద్దు వెనుక తిరిగి ప్రేమించమని అడుగుతుంది. ఆ ప్రేమకు పడిపోయిన సిద్దు.. మ్యాగీతో రిలేషన్ లోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలోనే మ్యాగీ వలన ఒక సమస్య వస్తుంది. సారీ చెప్తే పోయేదానికి.. సిద్దు తన తప్పు లేదని వాదిస్తాడు. అలా ఆ సమస్య పెద్దది అవుతుంది. అసలు ఆ సమస్య ఏంటి.. ? ఎందుకు సిద్దు సారీ చెప్పను అన్నాడు.. ? మ్యాగీ – సిద్దు చివరికి కలిశారా.. ? సిద్దును ఎక్స్ ఎందుకు వదిలేసింది.. ? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

Thandel: సోషల్ మీడియాను షేక్ చేసిన హైలెస్సో.. హైలెస్సా వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

అవసరం ఉన్నా లేకున్నా.. సారీ, థాంక్స్ అనే పదాలు రోజులో చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు నిజంగా వాటి అర్ధం ఏంటి.. ? ఏ సమయంలో వాటిని ఉపయోగిస్తారు.. ? ఈ లైన్ మీదనే కథ మొత్తం సాగుతుంది అని తెలుస్తోంది. కాలేజ్ కుర్రాడిగా కిరణ్ నటించాడు. అతడిలో ఉండే కోపం, ఉద్రేకం చాలా బాగా చూపించారు. ఇక మనుషులు ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా ఇందులో చూపించారు. సిద్దు తండ్రిగా ఆనంద్ నటించాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా.. సిద్దు.. మనుషులు మోసం చేయడం మొదలుపెట్టాకా అని ఆయన చెప్పే డైలాగ్ సినిమాకు హైలైట్ గా మారింది.

 

ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. ట్రైలర్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఇక రుక్సార్ కూడా ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.