Last Updated:

Allu Arjun: నా భార్య నువ్వు చచ్చిపోయినా పర్లేదు అంది.. స్నేహ గురించి బన్నీ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun: నా భార్య నువ్వు చచ్చిపోయినా పర్లేదు అంది.. స్నేహ గురించి బన్నీ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో.. అంతకు మించిన వివాదాలను కూడా తీసుకొచ్చిపెట్టింది. ఇక ఇప్పుడిప్పుడే వాటన్నింటి నుంచి బన్నీ బయటపడుతున్నాడు. నేడు అల్లు అర్జున్ 14 వ వివాహా వార్షికోత్సవం. దీంతో ఉదయం నుంచి అల్లు అర్జున్ కు, ఆయన భార్య స్నేహ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు.

 

ఇక అల్లు అర్జున్- స్నేహ చాలా సింపుల్ గా తమ 14 వ వివాహా వార్షికోత్సవంను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రతి ఏడాది పెళ్లి రోజుకు ఈ జంట వెకేషన్స్ లో గడుపుతూ ఉండేవారు. అయితే ఈసారి మాత్రం ఇంట్లోనే జరుపుకున్నట్లు కనిపిస్తుంది. వైట్ కలర్ డ్రెస్ లో బన్నీ, బ్లూ అండ్ వైట్ డ్రెస్ లో స్నేహ కేక్ కట్ చేస్తూ కనిపించారు.

 

అల్లు అర్జున్- స్నేహల ది లవ్ మ్యారేజ్. 2011 లో వీరిద్దరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. అప్పటివరకు అల్లరిచిల్లరగా ఉండే బన్నీని.. స్నేహ పూర్తిగా మార్చేసింది. పెళ్ళికి ముందు బన్నీ సినిమాల్లో ముద్దు సీన్స్ ఎక్కువ ఉండేవి. పెళ్లి తరువాత కిస్ సీన్స్ చేయను అని ఫిక్స్ అయ్యానని, అందుకు నా భార్య పర్మిషన్ కావాలని చెప్పుకొచ్చాడు. ఇక స్నేహరెడ్డి  గృహిణిగా అన్ని బాధ్యతలు చూసుకుంటూనే.. ఇంకోపక్క బిజినెస్ విమెన్ గా కొనసాగుతుంది.

Kona Venkat: అంజలితో నాకున్న సంబంధం అదే.. కారు గిఫ్ట్.. ఎవడు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్

2016లో స్నేహ రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో స్టూడియో పికాబూ అనే ఆన్‌లైన్ ఫోటో స్టూడియోను ప్రారంభించడం ద్వారా వ్యవస్థాపక ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఆమె  టాప్ లో కొనసాగుతోంది. భార్యగా, తల్లిగా, బిజినెస్ విమెన్ గా ఆమె అన్ని పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. ఒక మగాడి సక్సెస్ వెనుక ఆడది ఉంటుందని పెద్దలు చెప్తారు. అల్లు అర్జున్ సక్సెస్ వెనుక కచ్చితంగా స్నేహ సపోర్ట్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

 

స్నేహ గురించి అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. బన్నీ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో బన్నీ, స్నేహ యొక్క గొప్పతనం గురించి తెలిపాడు. ” ఈ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ సినిమా తరువాత ఆర్మీలో చేరాలనే కోరిక కూడా వచ్చింది. నేను ఆర్మీలో చేరాలంటే ఎవరి పర్మిషన్ తీసుకొనవసరం లేదు. నా తల్లిదండ్రులు, నా బిడ్డలు పర్మిషన్ అవసరం లేదు.

 

నేను ఎవరికైనా సమాధానం చెప్పాలంటే అది నా  భార్య స్నేహాకు మాత్రమే. అప్పుడే కాల్ చేసి ఇలా నేను ఆర్మీకి వెళ్లాలనుకుంటున్నాను.. ఏమంటావ్ అంటే.. వెంటనే ఓ.. వావ్ వెళ్లు అంది. ఏంటి వావ్ వెళ్లు అని అంటావ్.. అక్కడ డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరగడం కాదు. బోర్డర్ కు వెళ్లాలి. వార్ ఉంటే అందులో పాల్గొనాలి అన్నాను. దానికి స్నేహ.. మరి అక్కడ యుద్ధం చేయడానికి వెళ్లకుండా ఛిల్ల్ అవ్వడానికి వెళ్తావా అని అంది. మరి యుద్ధంలో నేను పోతే అని అంటే.. ఆమె హా.. ఒక చచ్చిపో.. నిన్ను చూసి మన ఫ్యామిలీ, నేను గర్వపడతాము అని చెప్పింది. నేను షాక్.. తన నుంచి అలాంటి ఒక ఆన్సర్ వస్తుంది అనుకోలేదు” అని చెప్పుకొచ్చాడు.  అంతలా వారి మధ్య బాండింగ్ ఉంటుంది అని తెలిపాడు.