Last Updated:

Sholay Movie: అమితాబచ్చన్ “షోలే” క్రేజ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినిమాగా రికార్డ్

Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.

Sholay Movie: అమితాబచ్చన్ “షోలే” క్రేజ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినిమాగా రికార్డ్

Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి. ఇప్పుడు ఒక సినిమా వందరోజులు ఆడడం అంటే పెద్ద వింతే అని చెప్పాలి. రిలీజైన రెండుమూడు వారాలకే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాయి. కానీ ఆనాటి రోజుల్లో ఒక్కో సినిమా పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఏ మూవీని ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారో తెలుసా? అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా నటించిన షోలే మూవీని ఎక్కుమంది ప్రేక్షకులు చూసి ఆదరించారట. బాలీవుడ్ అగ్రనటుడు అంజాద్‌ ఖాన్‌కు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్‌ ఇలా బాలీవుడ్ అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్మడయ్యేవనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి సంబంధించి 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయట.

దర్శకుడు రమేశ్‌ సిప్పీ తెరకెక్కించిన ఈ చిత్రం 1975లో విడుదలయ్యింది. తొలి షోకే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు దేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

షోలే హవా(Sholay Movie)..

షోలే క్రేజ్ కేవలం భారత్ కే పరిమితం కాలేదు.. ప్రపంచ దేశాల్లోనూ షోలే హవా చూపించింది. ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు విక్రయించారు. ఇక వరల్డ్ వైడ్ గా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడయ్యాయి. అలా భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. 1975లో వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల దాకా కలెక్ట్ చేసింది.