Amitabh Bachchan: అల్లు అర్జున్‌పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్ – అర్హతకు మించి ప్రశసించారు..
Amitabh Bachchan Comments on Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసుల కురిపించారు. పుష్ప 2లో తన యాక్టింగ్ తాను అభిమానిని అయిపోయానంటూ బన్నీకి ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో అమితాబ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇందులో అల్లు అర్జున్ ఊరమాస్ జాతరకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే మూవీ రిలీజ్‌కు ముందు టీం ప్రమోషన్స్‌ని భారీ ఎత్తున్న ప్లాన్ చేశారు. దేశంలో ప్రధాన నగరాలన్ని తిరుగుతూ ఇండియా మొత్తం చూట్టేశారు. ముంబైలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ఇంటర్య్వూలో అల్లు అర్జున్‌కి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ నిన్ను ఇన్‌స్పైర్ చేసిన యాక్టర్ ఎవరని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి బన్నీ తనని అత్యంత ప్రభావితం చేసిన నటుడు అమితాబ్ బచ్చన్ అని సమాధానం ఇచ్చాడు.
ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఆయన స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన దేశంలోనే నటులలోనే మెగాస్టార్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ వయసులో కూడా ఎంతో స్పోర్టివ్‌గా ఆయన సినిమాలు చేస్తున్నారు. స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ అలాగే ఉంది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో కొనసాగుతున్నారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు వెళుతున్నా” అంటూ అమితాబ్ గురించి చెప్పుకొచ్చారు. ఇక బన్నీ చేసిన కామెంట్స్‌పై అమితాబ్ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు.
“మీ వినయపూర్వక మాటలకు కృతజ్ఞతలు అల్లు అర్జున్ జీ. కానీ, అర్హత మించి నన్ను ప్రశంసించారు. నిజం చెప్పాలంటే పుష్ప 2లో మీ ప్రతిభకు, మీ పనితీరుకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మీరు ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలి. ఇలాంటి హిట్స్ మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నా” అంటూ బన్నీపై ప్రశంసలు కురిపంచారు అమితాబ్. ఇక ఆయన ట్వీట్ అల్లు అర్జున్ స్పందించాడు. “అమితాబ్ జీ.. మీరే మా సూపర్ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడం నమ్మలేకపోతున్నా. మీ కైండ్ వర్డ్స్, ఉదారమైన అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్యూ అమితాబ్ జీ” అంటూ రిప్లూ ఇచ్చాడు.