Home / devotees
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగించుకోనున్నారు. భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదం వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శన క్యూలైన్ల నిర్వహణ, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం, భక్తుల ఫీడ్ […]
Devotees: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం తరలిరానున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 16 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శదర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. శ్రావణమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు ప్రత్యేక సెలవు దినాలు, […]
Hyderabad: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు. నిన్న అమ్మవారికి బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించారు. నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం తర్వాత పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పే రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పోతురాజుల గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు ఘటాలు, పలహార బండ్ల ఊరేగింపు కూడా జరగనుంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా […]
Garuda Tickets: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు గాను తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్టలో గరుడ టికెట్ ను అందుబాటులోకి తీసుకువస్తామని ఈఓ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఈఓ వెంకట్రావు వెల్లడించారు. స్వామివారి దర్శనం త్వరగా చేసుకోవడం కోసం గరుడ టికెట్ ను తీసుకొస్తామని, ఈ టికెట్ ధర రూ. 5 వేలు ఉంటుందని […]
Ujjain Mahamkali Bonalu Starts from Today: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేళైంది. అమ్మవారి బోనాల సంబరం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అనేంతగా వైభవంగా ఉత్సవాలు సాగుతాయి. బోనాలు మరుసటి రోజులు జరిగే రంగం కార్యక్రమం కోసం కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర రేపటి నుంచి ఈనెల 15 వరకు ఘనంగా జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు […]
Shakambari Utsavalu: విజయవాడ ఇంద్రకీలద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో మూడు రోజులుగా శాకంబరీ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. రెండు రోజులపాటు అమ్మవారిని, ఆలయాన్ని పలు రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. నేడు కూడా శాకంబరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలాగే నేడు ఆషాడ పూర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నేడు ఉదయం 8 గంటల […]
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాడమాస సారెను సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, కానుకలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. అలాగే ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా ప్రతిఏటా శాకంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జులై 8,9,10 తేదీల్లో మూడు […]
Sparsha Darshanam In Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శదర్శనాలను నిన్నటి నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పర్శదర్శనం కోసం అధికారులు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్ లైన్ లో జారీ చేస్తారు. టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ […]
Yellamma Kalyanam: హైదరాబాద్ లో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేడు వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి వివాహం పూర్తిచేశారు. అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు […]
Chardham Yatra Stopped for 24 hours: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రకు ఆటంకం ఎదురవుతోంది. యాత్రను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నేడు, రేపు ఉత్తరాఖండ్ లో మరిన్ని భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ […]