Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 27 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 27 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజె క్టులు లేదా లక్ష్యాలు అంది వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా రాబడి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో వృద్ధి చెందుతాయి. తోబుట్టు వులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

వృషభం..

ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారముం టుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం..

జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచన న్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన తీపి కబురు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొంటారు.

కర్కాటకం..

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది.

సింహం..

కొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాలు ముందుకు వెళతాయి. సొంత పనుల విషయంలో బద్ధకించడం మంచిది కాదు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కన్య..

ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది.

తుల..

వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వివిధ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం..

నిరుద్యోగులకు అనుకోకుండా, అప్రయత్నంగా మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. శుభవార్త అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

ధనస్సు..

తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో ముందుకు పూర్తి అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

మకరం..

జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు ఉండకపోవడం చాలావరకు శ్రేయస్కరం.

కుంభం..

వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది.నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది.

మీనం..

ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.