Home / క్రైమ్
పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహాకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించిన కలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్‌పై బ్లేడ్‌తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్‌పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్ఐపై బ్లేడ్‌తో దుండగుల దాడికి పాల్పడ్డారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీవశిష్ట ఆశ్రమం ప్రధాన అర్చకుడు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కింద నేపాల్ నుంచి వచ్చిన ప్రసాద్ శ్రీ వశీష్ట ఆశ్రమంలో అర్చకుడిగా చేరాడు. అంతకుముందు కాశీలో అర్చకత్వం చేసి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నుంచి శ్రీ వశీష్ట
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్ జిల్లా పచ్‌గావ్ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఓ బాలిక ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించే నేపధ్యంలో ఆమె భవనంపై నుంచి దూకింది. బాధితురాలి సోదరుడి వాంగ్మూలం ఆధారంగా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని కళింగ నగర్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న మరణించాడు. అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారణ జరుపుతోంది, దివంగత నటుడి ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితాని మాదకద్రవ్యాల అలవాటును ప్రోత్సహించినట్లు ఎన్‌సిబి తన రిపోర్టులో పేర్కొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్, మిరాండా
గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి.. అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు.