Home / క్రైమ్
హైదరాబాద్ అంబర్ పేట నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మంటలతోనే ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకునే యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.
ఖమ్మంలో సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఏపీలో అరెస్ట్ చేశారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా, పోలీసులు ఎనిమిది మందిని ఈ కేసుల
క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్ సంచలణ కామెంట్స్ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్ అనే యాప్‌లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. తమ్మినేని కోటేశ్వర్రావు ఇంటిపై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అడిస్ అబాబా నుండి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నై వచ్చిన ఒక ప్రయాణీకుడినుంచి రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఇక్బాల్ బి ఉరందాడి అనేప్రయాణికుడిని అడ్డగించారు.
పోలీసు భద్రత కల్పించాలన్న చికోటి ప్రవీణ్ పిటిషన్‌పై తెలంగాణలో హైకోర్టులో విచారణ జరిగింది. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చికోటి ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కోరారు.
పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహాకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించిన కలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ఐ వినయ్‌పై బ్లేడ్‌తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మారేడ్‌పల్లి ఓం శాంతి హోటల్ దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్ఐపై బ్లేడ్‌తో దుండగుల దాడికి పాల్పడ్డారు.