Drugs Seized At Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రూ.100 కోట్లవిలువైన డ్రగ్స్ స్వాధీనం
అడిస్ అబాబా నుండి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నై వచ్చిన ఒక ప్రయాణీకుడినుంచి రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఇక్బాల్ బి ఉరందాడి అనేప్రయాణికుడిని అడ్డగించారు.

Chennai: అడిస్ అబాబా నుండి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నై వచ్చిన ఒక ప్రయాణీకుడినుంచి రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అధికారులు ఇక్బాల్ బి ఉరందాడి అనేప్రయాణికుడిని అడ్డగించారు. అతడినుంచి రూ.100 కోట్ల విలువైన 9.590 కిలోల బరువున్న హెరాయిన్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద ఈ పదార్థాన్ని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసారు.