IPO Listing: ఐపీఓ లిస్టింగ్లో సెబీ కొత్త ప్రతిపాదన
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఐపీఓలకు సంబంధించి లిస్టింగ్ సమమాన్ని తగ్గించాలని నిర్ణయించింది. సబ్ స్క్రిప్షన్ పూర్తి అయిన తర్వాత స్టాక్ ఎక్స్ చేంజీల్లో ఐపీఓ లిస్టింగ్ కావడానికి
IPO Listing: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఐపీఓలకు సంబంధించి లిస్టింగ్ సమమాన్ని తగ్గించాలని నిర్ణయించింది. సబ్ స్క్రిప్షన్ పూర్తి అయిన తర్వాత స్టాక్ ఎక్స్ చేంజీల్లో ఐపీఓ లిస్టింగ్ కావడానికి ప్రస్తుతం 6 రోజులు గడువు ఉంది. ఈ గడువును మూడు రోజులకు తగ్గించాలని సెబీ ప్రతిపాదించింది. ఈ గడువు తగ్గడం వల్ల అటు ఐపీఓకు వచ్చిన వారికి, మదుపరులకు కూడా మేలు జరుగుతుందని సెబీ అభిప్రాయపడింది.
లిస్టింగ్ సమయం తగ్గడం తో ఐపీఓలో సమీకరించిన మొత్తాన్ని కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు ఉపయోగించడం వీలు పడుతుందని సెబీ తెలిపింది. అదే విధంగా ఇన్వెస్టర్ల కు కూడా తమ పెట్టుబడులపై షేర్లను, లిక్విడిటీని తొందరగా పొందేందుకు వీలు పడుతుందని పేర్కొంది. లిస్టింగ్ సమయాన్ని టి+6 నుంచి టి+3 కి తగ్గించే ఈ అంశంపై జూన్ 3 వరకు ప్రజల నుంచి సెబీ అభిప్రాయాలు తీసుకోనుంది.
ఐపీఓ అంటే..?(IPO Listing)
ఒక కంపెనీ తమ షేర్లను ప్రజలకు జారీ చేయడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. అప్పటి వరకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న కంపెనీ.. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారుతుంది. ఏదైనా కంపెనీ ఐపీఓ కు వెళ్లడానికి ముందు చాలా తక్కువ మంది వాటాదారులను కలిగి ఉంటుంది. ఇందులో వ్యవస్థాపకులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారు. కానీ ఐపీఓ సమయంలో కంపెనీ తన షేర్లను ప్రజలకు విక్రయించడానికి ముందుకు వస్తుంది. అప్పడు పెట్టుబడిదారులుగా కంపెనీ నుంచి షేర్లను కొనుగోలు చేసి ప్రజలు వాటాదారులుగా మారవచ్చు. ఐపీఓల విషయానికి వస్తే వివిధ రకాల పెట్టుబడిదారుల వర్గాలు ఉన్నాయి. అందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయ్యర్స్ (క్యూఐబీ), నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ), రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (ఆర్ఐఐ).