Published On:

Volkswagen Tiguan R-Line: ఫీచర్లు మామూలుగా లేవు సామి.. టిగువాన్ ఆర్-లైన్ లాంచ్.. ఒక్కసారి ఎక్కరాంటే చాలు

Volkswagen Tiguan R-Line: ఫీచర్లు మామూలుగా లేవు సామి.. టిగువాన్ ఆర్-లైన్ లాంచ్.. ఒక్కసారి ఎక్కరాంటే చాలు

Volkswagen Tiguan R-Line Launched: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారతదేశంలో తన వాహన పోర్ట్‌ఫోలియోకు పెద్ద విస్తరణ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ కంపెనీ ఇటీవలే భారత మార్కెట్ కోసం రెండు కొత్త కార్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈరోజు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘టిగువాన్ ఆర్-లైన్’ ను అధికారికంగా అమ్మకానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ. 48.99 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించారు. మరి ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకత ఏమిటో చూద్దాం..!

 

వోక్స్‌వ్యాగన్ ఈ ఎస్‌యూవీని పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU) మార్గం ద్వారా భారతదేశానికి తీసుకువస్తోంది. అందుకే ఈ SUV భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర వోక్స్‌వ్యాగన్ కార్ల కంటే ఖరీదైనది. ఈ ఎస్‌యూవీ బోల్డ్, డైనమిక్ అలాగే ఆధునిక సాంకేతికత, ఫీచర్స్‌తో కూడి ఉంది” అని వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా అన్నారు. “ఈ ఎస్‌యూవీని పరిచయం చేయడం వెనుక ఉద్దేశ్యం వాల్యూమ్ పై ఎక్కువ దృష్టి పెట్టకుండా వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరచడమే” అని ఆశిష్ ఇంతకు ముందు చెప్పారు.

 

Volkswagen Tiguan R-Line Features
వోక్స్‌వ్యాగన్ అప్‌గ్రేడ్ చేసిన MQB ‘Evo’ ప్లాట్‌ఫామ్ ఆధారంగా, కొత్త టిగువాన్ పరిమాణంలో మునుపటి మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే, దాని పొడవు దాదాపు 30 మిమీ, ఎత్తు 4 మిమీ పెరిగింది. ఇది కాకుండా, దీని వీల్‌బేస్ కేవలం 2,680 మిమీ మాత్రమే. టిగువాన్ ముందు భాగంలో ఇప్పుడు ‘IQ లైట్ HD’ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌లు ఉన్నాయి, వీటిని పెద్ద టౌరెగ్ ఎస్‌యూవీలో ఉపయోగించడానికి అభివృద్ధి చేశారు. ఈ హెడ్‌లైట్ లైటింగ్ కోసం 38,400 మల్టీ-పిక్సెల్ LED లను ఉపయోగిస్తుంది. కొత్త టిగువాన్ మరింత ఏరోడైనమిక్‌గా కూడా ఉందని కంపెనీ చెబుతోంది.

 

Volkswagen Tiguan R-Line Engine
ఈ SUVలో కంపెనీ 2.0-లీటర్ TSI EVO పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ 204 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు, 4 మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ కెపాబిలిటీ, డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (DCC ప్రో) అన్ని రకాల రోడ్డు పరిస్థితులలోనూ మెరుగ్గా పనిచేసేలా రూపొందించారు.

 

Volkswagen Tiguan R-Line Cabin
కొత్త టిగువాన్ క్యాబిన్ గురించి చెప్పాలంటే, దీనిలో కొత్త డిజిటల్ కాక్‌పిట్ ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్‌ప్లే 15.1-అంగుళాల ఫ్రీస్టాండింగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో జత చేసి ఉంటుంది. కొత్త టిగువాన్ అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ కోసం డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ ప్రో ఎంపికను కూడా అందిస్తుంది. ఇది ట్విన్-వాల్వ్ వేరియబుల్ డంపర్‌లను వెహికల్ డైనమిక్స్ మేనేజర్ (VDM) సిస్టమ్‌తో మిళితం చేస్తుంది. VDM, ఇది ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, డంపర్ల పార్శ్వ డైనమిక్స్‌ను నియంత్రిస్తుంది.

 

దీని క్యాబిన్ 38.1 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ TFT LCD డిస్‌ప్లేతో కూడిన కొత్త మల్టీ-ఫంక్షన్ డ్రైవింగ్ ప్రొఫైల్‌లు, 26.04 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్‌తో మెరుగుపరుడుతుంది. ఇందులో మసాజ్ ఫంక్షన్‌తో “ఎర్గో యాక్టివ్” సీట్లు అందించారు. ఇవి అడ్జస్ట్ చేయగల లంబర్ సపోర్ట్‌తో ఉంటాయి. దీనితో పాటు, ఎయిర్-కేర్ క్లైమేట్రానిక్ (3-జోన్ ఎయిర్ కండిషనింగ్), పార్క్ డిస్టెన్స్ కంట్రోల్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్,రెండు స్మార్ట్ ఫోన్‌లకు ఇండక్టివ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

 

Volkswagen Tiguan R-Line Interior
ఎస్‌యూవీ లోపలి భాగాలు ముందు స్పోర్ట్ కంఫర్ట్ సీట్లపై ‘R’ ఇన్సర్ట్‌లతో అలంకరించారు, అయితే డ్యాష్‌బోర్డ్ కూడా ‘R’ లోగోను పొందుతుంది. దీనితో పాటు, ఈ ఎస్‌యూవీ చాలా అందంగా కనిపిస్తుంది, దీనిలో యాంబియంట్ లైటింగ్ (30 కలర్స్), పనోరమిక్ సన్‌రూఫ్, డోర్ హ్యాండిల్ రెస్ట్‌, బ్రష్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో పెడల్స్, వెల్‌కమ్ లైట్‌తో సరౌండ్ లైటింగ్ ఉన్నాయి.

 

Volkswagen Tiguan R-Line Safety Features
కొత్త టిగువాన్ ఆర్-లైన్ 21 లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు ఉంటాయి. ఈ ఎస్‌యూవీ 9-ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తున్నారు. దీనితో పాటు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, మరెన్నో దీనిని సురక్షితమైన ఎస్‌యూవీగా చేస్తాయి. ఈ ఎస్‌యూవీ యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది.

 

Volkswagen Tiguan R-Line Bookings
కంపెనీ ఇప్పటికే టిగువాన్ ఆర్-లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ డెలివరీ ఏప్రిల్ 23, 2025 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇది మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.