Published On:

Bajaj Platina 2025 Launch: డిస్క్ బ్రేక్‌తో బజాజ్ ప్లాటినా.. షోరూమ్‌లకి వచ్చేసింది.. ఆ మూడు బైక్‌లకు చుక్కలే..!

Bajaj Platina 2025 Launch: డిస్క్ బ్రేక్‌తో బజాజ్ ప్లాటినా.. షోరూమ్‌లకి వచ్చేసింది.. ఆ మూడు బైక్‌లకు చుక్కలే..!

Bajaj Platina 2025 Launching: 2025 బజాజ్ ప్లాటినా 110 మరోసారి తిరిగి వచ్చింది. ఈ బైక్‌ని కొన్ని నెలల క్రితం నిలిపివేశారు. కానీ ఇప్పుడు ఈ బైక్ మరో అవతారంలో కనిపించబోతోంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. పూణేకు చెందిన ద్విచక్ర వాహన బ్రాండ్ ఈ మోడల్‌ను నిశ్శబ్దంగా అప్‌డేట్ చేసింది. ఈసారి ఈ బైక్‌‌లో కాస్మెటిక్, మెకానికల్ అప్‌గ్రేడ్లు చేశారు. ఈ బైక్ లాంచ్‌‌కు ముందే షోరూమ్‌లకి చేరుకుంది. ఆ ఫోటోలను చూస్తే బజాజ్ దీనిలో చాలా అప్‌డేట్స్ చేసిందనిస్పష్టమవుతుంది. కంపెనీ త్వరలో ఈ బైక్‌ను లాంచ్ చేయనుంది. దాని ధర కూడా వెల్లడించనుంది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

2025 Bajaj Platina Design
కొత్త 2025 ప్లాటినా 110 బ్లాక్, గ్రీల్ కలర్‌తో కొత్త డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్, అల్లాయ్ వీల్స్‌లో గ్రీన్ కలర్స్ హైలైట్‌లను చూడవచ్చు. హైలైట్స్, ఇతర విషయాలలో కూడా చేస్తారు. బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు.

 

2025 Bajaj Platina Engine
ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, కొత్త ప్లాటినా 110 లో OBD-2B ఉద్గారంతో కూడిన ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్‌లో 110cc Fi ఇంజన్ ఉంటుంది, కానీ దీనికి ఎంత పవర్, టార్క్ ఉంటుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. పాత మోడల్ 8.5బిహెచ్‌పి, 9.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసింది. కొత్త ఇంజిన్ మెరుగైన మైలేజీని, పనితీరును అందిస్తుంది.

 

2025 Bajaj Platina Specifications
నివేదికల ప్రకారం.. 2025 బజాజ్ ప్లాటినా 110 మునుపటి మోడల్ నుండి హాలోజన్ హెడ్‌లైట్లు, LED DRLలు, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సీట్ కవర్లు వంటి కొన్ని అంశాలను తీసుకుంటుంది. బైక్ ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కానీ కొత్త మోడల్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సౌకర్యం కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 100, టీవీఎస్ స్పోర్ట్ బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.