Toyota New Electric Car: ఈవీ రేసులోకి టయోటా.. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్.. సింగిల్ ఛార్జ్‌పై 400 కిమీ రేంజ్..!

Toyota New Electric Car: కొన్నేళ్లుగా భారత్‌లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. 2024 మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 52 శాతం ఉందంటే.. ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా ఈ రేసులోకి చేరింది. ప్రపంచ మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్‌ను మార్చి 11న ఆవిష్కరించనున్నారు. కానీ కంపెనీ ఇప్పటికే ఈ కారు టీజర్‌ను విడుదల చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం కొత్త టయోటా EV 2022 bZ కాంపాక్ట్ క్రాస్ఓవర్ కాన్సెప్ట్ ఉత్పత్తి మోడల్‌గా ఉండే అవకాశం ఉంది.
టీజర్ ప్రకారం.. కొత్త మోడల్ ముందు, వెనుక లైట్ క్లస్టర్లను చూడచ్చు. ఇది ఒక పొడవైన బోనెట్‌తో మృదువైన 4-డోర్ కూపే ఆకారాన్ని తీసుకుంటుంది. వెనుక వైపున ఉన్న బూట్ లిప్ వరకు విస్తరించి ఉన్న C-పిల్లర్ బూట్ లిడ్‌పై వెనుక భాగంలో ఒక చిన్న స్పాయిలర్ ఉంటుంది. టెయిల్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ లైట్ బార్ ఎలిమెంట్‌ను కలిగి ఉంది, అయితే హెడ్‌ల్యాంప్ డీఆర్ఎల్ సిగ్నేచర్ bZ కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది.
టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కానప్పటికీ, క్యాబిన్ bZ EVలను పోలి ఉండచ్చు. దాని మధ్యలో ఉండే పెద్ద టచ్ స్క్రీన్ ఉండొచ్చు. ఈ కారు AWDతో వస్తుంది. ఇది కాకుండా డ్యూయల్ మోటార్‌తో కూడా రానుంది. కొత్త EV bZ4X ఉపయోగించే E-TNGA ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి.
లేలెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. టయోటా కొత్త ఈవీని రెండు బ్యాటరీ ప్యాక్‌లతో తీసుకురావచ్చు. ఇందులో 49కిలోవాల్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్ పై 400 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కారు 181బిహెచ్‌పి, 300 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ కారును భారత్‌లో ఏ ధరకు తీసుకువస్తారు, దీని రేంజ్ ఎంత ఉంటుందో చూడాలి. ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలో సమాధానాలు లభించే అవకాశం ఉంది.