JSW MG Mifa 9: ఎమ్‌జీ నుంచి మరో బ్రహ్మాస్త్రం.. త్వరలో బాహుబలి ఎమ్‌పివి.. సెకన్స్‌లో 100 కిమీ స్పీడ్..!
JSW MG Mifa 9: బ్రిటీష్ వాహన తయారీ సంస్థ JSW MG భారతీయ మార్కెట్లో అనేక గొప్ప ఎస్‌యూవీలను అందిస్తోంది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ అనేక గొప్ప కార్లను విడుదల చేయనుంది. అందులో ఒకటి JSW MG Mifa 9 కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.
భారత్ మొబిలిటీ 2025లో MG మోటార్స్ మూడు వాహనాలను విడుదల చేయనుంది. వీటిలో కనీసం రెండు వాహనాలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో తీసుకురానుంది. MG సైబర్‌స్టర్‌తో పాటు, ఆటో ఎక్స్‌పో 2025లో MG మిఫా 9ని కూడా లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనం గురించి ఇంకా అధికారిక సమాచారం బయటకురాలేదు. ఇది జనవరిలో విడుదల కానుంది. కొంత సమయం తర్వాత అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
కంపెనీ కొన్ని దేశాల్లో MIFA 9ని ఎలక్ట్రిక్ MPVగా అందిస్తోంది. ఇది బ్రిటన్‌తో సహా కొన్ని దేశాల్లో SAIC Maxus ద్వారా అందుబాటులోకి వచ్చింది. హై సీట్ బానెట్, సొగసైన డిజైన్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన లైట్లు, LED DRL, స్లైడింగ్ రియర్ డోర్ వంటి కొన్ని ఫీచర్లతో దీనిని వాహనంలో తీసుకురావచ్చు.
MG మిఫా 9 ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్, టెయిల్‌గేట్, ఏడు సీట్ల ఎంపికతో వస్తుంది. ఇందులో రెండో వరుసలో పైలట్ సీట్లు కూడా ఇస్తారు. 466.2 లీటర్ బూట్ స్పేస్, ఫుల్ బ్లాక్ ఇంటీరియర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, స్మార్ట్ కీ, ఫ్రంట్ ఆటో వైపర్ వంటి అనేక ఫీచర్లు అందించారు.
ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎమ్ఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, అడాస్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఐసిఎ, ఎఈబిఎస్, ఎస్ఎఎస్, ఇంటెలిజెంట్ హెడ్‌లైట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వెనుక రాడార్, టైర్ రిపేర్ కిట్ వంటి భద్రతా ఫీచర్లు అందించారు.
కంపెనీ దానిలో 90kWh సామర్థ్యం గల బ్యాటరీని అందించనుంది. దీని కారణంగా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 430 నుండి 565 కిలోమీటర్ల రేంజ్ పొందచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 30 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. ఇందులో అమర్చిన మోటారు నుంచి 180 కిలోవాట్ల పవర్, 350 న్యూటన్ మీటర్ల టార్క్ లభిస్తుంది. 9.9 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.
Mifa 9 గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కాకుండా ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ ఎంపికను కూడా కలిగి ఉంటుంది. ఈ వాహనానికి సంబంధించి JSW MG మోటార్స్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ఇది దాదాపు రూ. 55 నుండి 60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా. ICE వెర్షన్‌తో తీసుకొచ్చిన కియా కార్నివాల్ వంటి MPVలతో మార్కెట్‌లో దీని ప్రత్యక్ష పోటీ ఉంటుంది.