Last Updated:

Ather 450 Apex Launched: మస్త్‌గా ఉంది.. కొత్తగా వస్తున్న ఏథర్ 450 అపెక్స్.. ఫీచర్లు చూశారా..?

Ather 450 Apex Launched: మస్త్‌గా ఉంది.. కొత్తగా వస్తున్న ఏథర్ 450 అపెక్స్.. ఫీచర్లు చూశారా..?

Ather 450 Apex Launched:  ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ స్కూటర్ 450 అపెక్స్‌ను అప్‌డేట్‌లతో విడుదల చేసింది. స్కూటర్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. అయితే దీని ధర రూ.1.99 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉంటారు. ఇది మూడు  ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లను కలిగి ఉంది. కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-40 కిమీ వేగాన్ని అందుకోగలదు. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

450 అపెక్స్ ఇప్పుడు మూడు విభిన్న ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లను కలిగి ఉంది. అందులో రెయిన్, రోడ్, ర్యాలీ. జారే రోడ్లపై మెరుగైన పట్టు కోసం ఇది రెయిన్ మోడ్‌ను కలిగి ఉంది. అయితే, రోడ్ మోడ్ సాధారణ రహదారి కోసం. రేసింగ్ , ఆఫ్-రోడింగ్ కోసం ర్యాలీ మోడ్‌ను ఉపయోగించవచ్చు.

విశేషమేమిటంటే, రైడర్ తన అవసరాన్ని బట్టి ట్రాక్షన్ కంట్రోల్‌ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. తద్వారా స్కూటర్‌ను ఫుల్ కంట్రోల్‌‌లో ఉంటుంది. కొత్త Zapper N e-Tred టైర్లను రూపొందించడానికి ఏథర్ MRFతో కలిసి పనిచేసింది. ఈ టైర్లు తక్కువ-రోలింగ్ రెసిస్టెన్స్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి, ఇది స్కూటర్, బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంది.

బ్యాటరీ రేంజ్ గురించి చెప్పాలంటే మునుపటితో పోలిస్తే ఇప్పుడు రేంజ్ 105 కి.మీ. 130 కి.మీ నుంచి పెరిగింది. 450 అపెక్స్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-40 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 100 కిమీ/గం, ఇది 450X కంటే 10 కిమీ/గం ఎక్కువ. 450 అపెక్స్ డిజైన్ ఇతర 450 మోడళ్ల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది బ్రైట్ బ్లూ బాడీవర్క్, ఆరెంజ్ అల్లాయ్ వీల్స్‌తో పరిచయం చేశారు. ఇది కనిపించే సైడ్ ప్యానెల్‌లను కలిగి ఉంది, దీని ద్వారా దాని అల్యూమినియం సబ్‌ఫ్రేమ్ కనిపిస్తుంది.

450 అపెక్స్ పూర్తి ఫీచర్లతో తయారు చేశారు. ఇది అన్ని-LED లైటింగ్, TFT డిస్‌ప్లే (బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ నావిగేషన్‌తో), 6 రైడ్ మోడ్‌లను (స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్,వార్ప్ ప్లస్) పొందుతుంది. 450 అపెక్స్ అద్భుతమైన పనితీరు, స్టైలిష్ లుక్స్, అధునాతన ఫీచర్లను కోరుకునే రైడర్‌లకు సరైనది. దీని ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, లాంగ్ బ్యాటరీ రేంజ్ , హై స్పీడ్ ఇండియన్ మార్కెట్‌లో ప్రీమియం ఎంపికగా నిలిచింది. మీరు అధునాతన,స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, Ather 450 Apex మీ అంచనాలను అందుకోగలదు.