Uric Acid Health Tips: యూరిక్ యాసిడ్ తో కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు.. నిర్లక్ష్యం చేయకండి

Uric acid health tips: యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో ఉండే ఒక వ్యర్థపదార్థం. మామూలుగా వ్యర్థాలు మూత్రం నుంచి బయటకు వెలతాయి. అయితే , కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ శరీరం లోపలే ఉండిపోతుంది. దీనినే హైపర్ యూరిసెమియా అంటారు. దీని వలన కీళ్లలో నొప్పులు, వాపులు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ శరీరంలో తయారవుతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్స్ లెవల్స్ పెరిగితే అది చిన్న చిన్న స్పటికాలుగా ఏర్పడి కీళ్లలో ఉండిపోతాయి. దీంతో కీళ్ల నొప్పులు ఏర్పడతాయి. ఇది కీళ్ల మధ్యలో ఉండే గుజ్జును ఇవి తినేస్తుంది. దీంతో కీళ్ల అరుగుదల ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇది మధ్య వయస్సు నుంచి మొదలవుతుంది. ముదుసలి వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా బాధపడేవాటిలో కీళ్ల నొప్పులు ఒకటి. దీంతో వాళ్లు నడవడం కూడా కష్టంగా మారుతుంది.
యూరిక్ యాసిడ్ పెరగడానికి ముఖ్యకారణాలు
రెడ్ మీట్ ను ఎక్కువగా తినేవారిలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీంతో పాటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, పప్పులు ఎక్కువగా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కూడా కారణమే.
కొన్ని నివేధికల ప్రకారం.. యూరిక్ యాసిడ్ వెంటనే ప్రభావం చూపెట్టదు. కీళ్లలో గుజ్జు తగ్గేవరకు, కిడ్నీలో రాళ్ల వంటి తీవ్రప్రభావాలు కలుగుతున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్ ను గుర్తించవచ్చు. ఇవి కీళ్లల్లో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లు మంటగా, వాపు ఏర్పడుతుంది.
నడుము కింది బాగం నిప్పి, తీవ్రమైన అసౌకర్యం వలన వాంతులు వికారం, ఇన్పెక్షన్ జ్వరం చలి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లాంటివి సంభవిస్తాయి. యూరిక్ యాసిడ్ వలన కలిగే ఇబ్బందులపై అవగాహన ఉండాలి. ఇలాంటివి కనపడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించగలరు.
గమనిక… పైన తెలిపిన విషయాలు సాధారణ సమాచారం మాత్రమే. పాటించే ముందు డాక్టర్లను నిపుణులను సంప్రదించగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.