Tata Curvv Pulls Boeing 737: ఇదిరా దమ్మంటే.. బోయింగ్ విమానాన్ని లాగిన టాటా కర్వ్.. సరికొత్త రికార్డ్..!

Tata Curvv Pulls Boeing 737: టాటా మోటార్స్ కొత్త ఎస్‌యూవీ టాటా కర్వ్ 48,000 కిలోల బరువున్న బోయింగ్ 737 విమానాన్ని లాగింది. ఈ పవర్ ఫుల్ ఫీట్ ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. ఈ SUV కేవలం 1,530 కిలోల బరువుతో ఈ చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది. దీని ద్వారా కర్వ్ బలం, శక్తిని అంచనా వేయచ్చు.
టాటా కర్వ్ ఈ విజయానికి కారణం దాని అధునాతన అట్లాస్ ప్లాట్‌ఫామ్, శక్తివంతమైన 1.2-లీటర్ GDI ఇంజిన్, ఇది అద్భుతమైన టార్క్, అధిక పనితీరును అందించగలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక దాని పెట్రోల్,డీజిల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఇది డ్రైవింగ్ అనుభవాన్ని చాలా మృదువైన, శక్తివంతమైనదిగా చేస్తుంది.
View this post on Instagram
టాటా Curvv పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. ఇది LED హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, ఎయిర్‌బ్యాగ్స్, యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీ పెట్రోల్-డీజిల్ మోడల్ ధర రూ. 10 లక్షల నుండి మొదలై, రూ. 19 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది, అయితే ఎలక్ట్రిక్ వేరియంట్ ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ అందుబాటులో ఉంది. టాటా కర్వ్ ఈ ఫీట్ కేవలం స్టైలిష్‌గా మాత్రమే కాకుండా శక్తివంతమైన పనితీరు, బలం పరంగా ఎవరికీ తక్కువ కాదని రుజువు చేస్తుంది.