Maruti Fronx: ఫ్రాంక్స్ కొత్త రికార్డ్.. అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది!
Maruti Fronx: భారతీయ ఆటో మార్కెట్‌లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజికి బడ్జెట్ ధరలో అనేక కార్లను విక్రయిస్తోంది. వీటిలో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. వీటిలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఉంది. ఇది మంచి అమ్మకాలతో దేశంలో ప్రజాదరణ పొందింది. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టయోటా అర్బన్ క్రూయిజర్ టిస్సర్‌తో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ధర, మైలేజ్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.52 లక్షల నుండి రూ. 13.04 లక్షలు. సిగ్మా, డెల్టా, డెల్టా + , డెల్టా + (O), జీటా, ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే CNG పవర్‌ట్రెయిన్ సిగ్మా, డెల్టా ట్రిమ్‌లలో మాత్రమే అందించారు. మారుతి ఫ్రాంక్‌లకు రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హై బ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది.5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్.
మరో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMTతో అందుబాటులో ఉంది.CNG రియంట్‌ల 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే 1.2 లీటర్ ఇంజన్‌తో శక్తిని పొందుతాయి. మైలేజీ విషయానికి వస్తే 1.2 లీటర్ మాన్యువల్ 21.79 కిమీ, 1.2 లీటర్ ఆటోమేటిక్ 22.89 కిమీ, 1 లీటర్ మాన్యువల్ 21.5 కిమీ, 1 లీటర్ ఆటోమేటిక్ 20.1 కిమీ, 1.2 లీటర్ సిఎన్‌జి 28.51 కిమీలను అందిస్తుంది.
హెడ్స్ అప్ డిస్‌ప్లేతో కూడిన 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్‌లను పొందుతుంది.
దేశంలో మారుతి ఫ్రాంక్ మహీంద్రా XUV3X0, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్ అలాగే సిట్రోయెన్ C3, హ్యుందాయ్ ఎక్సెటర్ వంటి సబ్‌కాంపాక్ట్ SUVలతో పోటీపడుతుంది.
2023లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి ఫ్రాంక్స్ 2 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని సాధించింది. ఇంతకు ముందు కేవలం 7 నెలల్లో 1 లక్ష యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు కూడా ఈ కారు అదే డిమాండ్‌తో వృద్ధి చెందుతోంది.