Home /Author Narasimharao Chaluvadi
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలోని మహిళా కమీషన్ బాధ్యతలు ఎంతమేరకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ గుర్తు చేసింది. ఓ పార్టీకి కొమ్ముకాసేలా రాష్ట్ర మహిళా కమీషన్ వ్యవహారిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఎండగట్టింది.
భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకోబోతుంది. ఒక రాకెట్ ద్వారా 6టన్నుల ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనతను చేజిక్కించుకోబోతుంది. అందుకు వేదికగా తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి 12.07 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం2 (ఎల్ఏఎం3) రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది.
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకొన్నారు. అశువులు బాసిన పోలీసులను స్మరించుకొంటూ చేపట్టిన కార్యక్రమాల్లో నేతలు, ప్రజలు, విద్యార్ధులు స్వచ్ఛందంగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.