Home /Author Guruvendhar Reddy
Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లోనే ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంటుపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు […]
Heavy rain forecast for AP Storm in the Bay of Bengal: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని […]
Former Minister Mekathoti Sucharitha Big shock to YSRCP: వైసీపీకి మరో షాక్. ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి, జనసేనలోకి చేరగా, ఆ పొరుగు జిల్లాకు చెందిన నేత సుచరిత నేడో, రేపో ఆ పార్టీకి వీడ్కోలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విధేయ నేతగా గుర్తింపు.. […]
Southern Railway announces Sabarimala Special Trains: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ – కొట్టాయం; కొట్టాయం – సికింద్రాబాద్; మౌలాలి – కొట్టాయం; కాచిగూడ – కొట్టాయం; మౌలాలి – కొల్లం మధ్య జనవరి 3 […]
ICQC Aviation Safety International Standards: భారత విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానయాన భద్రతను కల్పించేందుకు క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను (ఐక్యూసీయూ) ప్రారంభించినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐఎన్టీ) దీపక్ వర్మ ఆదివారం తెలిపారు. ఐక్యూసీయూ ఏర్పాటు చేసి, దేశంలోని 68 విమానాశ్రయాల్లో విమానయాన భద్రతా దళం (ఏఎస్జీ) అందించే భద్రతను మెరుగుపర్చేందుకు సీఐఎస్ఎఫ్ దళం కీలకమైన ముందడుగు వేసిందన్నారు. ప్రపంచస్థాయి భద్రతా విధానాలు, సాంకేతికతలను రూపొందించడంలో ఐక్యూసీయూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ […]
Syrian rebels topple President Assad: సిరియా అంతర్యుద్ధంలో రెబెల్స్ విజయం సాధించింది. ఈ మేరకు సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రెబల్స్ ప్రకటించింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాత్రం ఎవరికి కనిపించకుండా పారిపోయినట్లు సమాచారం. అయితే, సిరియా రాజధాని డెమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అసద్ రష్యా తయారీ ఐఎల్ 76 విమానంలో పారిపోయనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసద్ ప్రయాణిస్తున్న ఈ […]
Farmers’ ‘Delhi Chalo’ March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. అనంతరం రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ ర్యాలీలో రైతులు లేరని పోలీసులు చెబుతున్నారు. తమకు చెప్పిన 101 మంది […]
Road Accident In Palnadu District 4 Killed: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి ఎదురుగా చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ […]
Manchu Manoj and Mohan Babu File Police Complaints Against Each Other: మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న విబేధాలు బయటకు వచ్చాయి. తండ్రీకొడుకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని వార్తలు వస్తున్నాయి. తనపై దాడికి చేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ సైతం పోలీసులకు […]
BRS Releases Charge Sheet on Congress One Year Rule: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ అంటూ మొత్తం 18 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కిందని […]