Home /Author anantharao b
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని గంగా ఘాట్ల వద్ద విదేశీ మహిళలు బికినీలు ధరించి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవిత్ర గంగా నదిలో స్విమ్సూట్లతో వారు ఆడుతున్న దృశ్యాలను చూపే ఫుటేజీకి వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ఇండోనేషియాలోని సెంట్రల్ ద్వీపం సులవేసిలో ఒక అక్రమ బంగారు గని సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించగా 19 మంది తప్పిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.
ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన భారీ వైమానిక దాడలో 20 మంది మరణించారు. సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది మరణించారు. ఈ దాడి గత కొద్దినెలలుగా జరగుుతున్న దాడుల్లో అతిపెద్దదాడిగా చెప్పవచ్చు.
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చైర్మన్ల నియామక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు 35మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ యొక్క వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.