YS Jagan Pay Tributes: మాజీ సీఎం వైఎస్ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన వైఎస్ జగన్
దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
YS Jagan Pay Tributes: దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ ఘాట్ కు నివాళులు అర్పించిన అనంతరం..జగన్ ను దగ్గరకు తీసుకొని ముద్దాడింది. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. మరోవైపు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల నివాళులర్పించారు. భర్త, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల.. వైఎస్ఆర్ ఘాట్‌పై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. వైయస్సార్ ఒక డైనమిక్ లీడర్ అని ఆమె అన్నారు. లీడర్ అంటే ఎలా ఉండాలని ఆదర్శంగా నిరూపించిన నాయకుడు వైయస్సార్ అని గుర్తుచేశారు.
జగన్ భావోద్వేగ ట్వీట్..( YS Jagan Pay Tributes)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకోని మాజీసీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు అందరికీ పండుగ రోజు అని. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గమని అన్నారు. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి ఉంటుందని ట్వీట్ చేశారు.
ప్రత్యేక వీడియోను విడుదల చేసిన రాహుల్ గాంధీ..
వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను విడుదల చేశారు. అసలైన ప్రజా నాయకుడు వైఎస్సార్ అని..ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని కొనియాడారు. వైఎస్సార్ మరణం అత్యంత విషాదమన్న రాహుల్ గాంధీ…ఆయన బ్రతికుంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు. వైఎస్సార్ బ్రతికుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని..వైఎస్సార్ వారసత్వాన్ని షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నమ్మకం తనకు బలంగా ఉందన్నారు. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని..వైఎస్సారఖ లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశాన్నారు. తాను వ్యక్తిగతంగా వైఎస్సార్ నుంచి ఎంతో నేర్చుకున్నానని రాహుల్ అన్నారు. వైఎస్సార్ పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తినిచ్చిందన్నారు. నాడు వైఎస్సార్ ఎండను, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడని..ఆయనే తనకు స్పూర్తి అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు YCP సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు.. కాసేపటి క్రితం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ సైతం వైఎస్ కు.. నివాళులు అర్పించారు.