Home /Author anantharao b
తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా గ్రూప్ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది.
వచ్చే నెలలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరయ్యే ఉత్తరప్రదేశ్ బృందానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వహిస్తారు. దీనితో ఈ ఫోరమ్‌కు హాజరవుతున్న తొలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి రికార్డులకెక్కనున్నారు.
అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇది 50 కి.మీ., పాటు సాగింది. ఇది బహుశా భారతదేశంలోనే అత్యంత పొడవైనది. ఇది 14 విధానసభ స్థానాల గుండా సాగింది
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆసుపత్రుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని మంగళగిరి ఎన్నారై హాస్పిటల్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఇస్రో గూఢచర్యం కేసులో , మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సహా నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది.1
బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలతో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లోని పలు గోడలు గురువారం ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్ నాగోల్ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలోచంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టిడిపి నాయకులు. టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసిపి నేతలు.
ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టం చేసింది.