Home /Author anantharao b
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి ఇప్పుడు నిజమైన ఊటిగా మారింది. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా జలపాతాలు జాలువారుతున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసి పర్యాటకులే కాదు స్ధానికులు కూడా మైమరిచిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకారం, ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు జరుపుకుంటున్నాయి. భారతదేశం-శ్రీలంక దీర్ఘకాల సంబంధాలను సమీక్షించడానికి మరియు మరింత ఊపందుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని సూచిస్తుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ చార్జిషీట్లో ప్రస్తావించిన కీలక అంశాలు బయటికి వచ్చాయి. హత్యకు కుట్ర చేశారని, ఘటనాస్థలంలో ఆధారాలు చెరిపేశారని సీబీఐ తెలిపింది. ఫొటోలు, గూగుల్ టేక్ అవుట్, లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు అవినాష్, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ నిర్థారించింది.
మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.
మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విధించిన రెండేళ్ల జైలు శిక్ష కేసులో సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా పడింది. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.దీనిపై విచారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసినా రాహుల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు
టయోటా కిర్లోస్కర్ మోటార్ నుండి హిలక్స్ పికప్ ట్రక్ యొక్క మొదటి బ్యాచ్ వాహనాలనును ఇండియన్ ఆర్మీ అందుకుంది. ఈ వాహనాలను ఫ్లీట్లోకి చేర్చాలని నిర్ణయించే ముందు ఈ వాహనాన్ని భారత సైన్యం యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ యొక్క నార్తర్న్ కమాండ్ రెండు నెలల కఠినమైన పరీక్షలు నిర్వహించింది.
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్‌లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు 'ప్రీతి'గా చెప్పినట్లు బయటపడింది.
భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరిజిల్లాలో గోదావరి, శబరి నదులకి వచ్చిన వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్ పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.