Home /Author anantharao b
జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్‌కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.
నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.
బాగ్దాద్‌లోని స్వీడిష్ రాయబార కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున వందలాది మంది నిరసనకారులు దాడి చేసి నిప్పంటించారు,. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను స్వీడన్లో తగులబెట్టడంతో షియా మతగురువు ముక్తాదా సదర్ మద్దతుదారులు ఈ నిరసనకు పిలుపునిచ్చారు,
వందే భారత్ రైలులో బాత్రూమ్ని ఉపయోగించినందుకు ఒక వ్యక్తి రూ.6,000 నష్టపోయాడు. దీనికి సంబంధించి వివరాలివి. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్రౌలీకి వెడుతున్నాడు
హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలని పరిశీలించేందుకు వెళుతున్నకేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓఆర్ఆర్పై తుక్కుగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడిరోడ్డుపై కిషన్ రెడ్డితోపాటు ఇతర బిజెపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిషన్ రెడ్డి తదితరులని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయానికి తరలించారు.
నెట్‌ఫ్లిక్స్ గురువారం భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ప్రకటించింది. ఒక ఇంటి సభ్యులు మాత్రమే ఒకే ఖాతాను యాక్సెస్ చేయగలరని ప్రకటించింది. గత సంవత్సరం కఠినమైన పాచ్ తర్వాత కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున, వినియోగదారులు వారి సమీప కుటుంబానికి మించిన వ్యక్తులతో పాస్‌వర్డ్‌లను పంచుకోవడంపై మేలో ప్రకటించిన గ్లోబల్ అణిచివేతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో రాయ్‌గఢ్ జిల్లాఇర్సల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి పది మంది మరణించారు. ఈ శిధిలాల కింద 50 మంది దాకా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు 17 రోజులపాటు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.మణిపూర్ హింస, రైల్వే భద్రత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-చైనా సరిహద్దు స్థితి మరియు రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత వంటి ఇతర అంశాలను వర్షాకాల సమావేశంలో లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి
నీట్ ద్వారా పీజీ మెడికల్ కోర్సుల్లో అన్ని రాష్ట్రాలు ఒకే సారి కౌన్సిలింగ్ చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్. మొదట డీమ్డ్ యూనివర్శిటీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని నాన్ లోకల్ కోటా సీట్లకు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ అభ్యర్దులకు సూచనలు అందించారు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.