Home /Author anantharao b
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ శనివారం ఆరోపించింది. మే 4 మణిపూర్ వీడియోపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వచ్చింది.
యూపీలో ఒక యువకుడు తన సోదరి వేరొక వ్యక్తిని ప్రేమించిందన్న కారణంగా ఆమె తలను నరికి దానితో పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. . ఫతేపూర్ ప్రాంతంలోని మిత్వారా గ్రామంలో 22 ఏళ్ల రియాజ్ మరియు అతని 18 ఏళ్ల సోదరి ఆషిఫా మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 25 కు చేరింది. ఈ ఘటనలో 86 మంది గ్రామస్తుల జాడ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. వీరికోసం గాలింపు జరుగుతోందని అన్నారు.
Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునాక్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ రెండు సీట్లు కోల్పోయింది. అయితే బ్రిటన్ పార్టమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా కీలకమైన సీటును కన్సర్వేటివ్ పార్టీకి అప్పగించుకుంది
ట్రూ కాలర్ ఐడీ మరియు స్పామ్ ఫిల్టరింగ్ యాప్, ఇటీవల భారతదేశంలో AI- పవర్డ్ అసిస్టెంట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ అవాంఛిత స్పామ్ కాల్‌లను ఫిల్టర్ చేస్తున్నప్పుడు రిసీవర్ తరపున కాల్లకు సమాధానం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అసిస్టెంట్ అనేది మరో వైపు కాలర్‌తో ఎంగేజ్ చేయడం ద్వారా ట్రూకాలర్ కాలర్ ID ఫీచర్ వంటి ఇన్కమింగ్ కాల్‌లను గుర్తించేది.
ఫ్లోరిడాలోని ఎనిమిదేళ్ల బాలికకు మెక్‌డొనాల్డ్ చికెన్ మెక్నగెట్ కాలు మీద పడి గాయమవడంతో మెక్‌డొనాల్డ్ $800,000 (రూ.6 కోట్లు)నష్టపరిహారం చెల్లించింది. ప్రమాదకరమైన వేడి' మెక్నగ్గెట్ తో మైనర్ శరీరం కాలి గాయమవడంతో కుటుంబం $15 మిలియన్ల నష్టపరిహారాన్ని కోరింది. ఒలివియా అనే బాలికకు నాలుగేళ్ల వయసులో 2019లో ఈ ఘటన జరిగింది.
కేంద్రం గురువారం నాడు నాన్ బాస్మతి అంటే తెల్లబియ్యం ఎగుమతిని నిషేధించింది. దీంతో గ్లోబల్ ఫుడ్ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది లోకసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.