Home /Author anantharao b
విభిన్నమైన కంటెంట్ ఎంపికలను అందించే ప్రయత్నంలో, ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్ "ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో సుదీర్ఘమైన మరియు క్లిష్టమైన కథనాలను, పుస్తకాలను ప్రచురించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మొదట కెనడా, ఘనా, యూకే మరియు యూఎస్ లోని వినియోగదారులకు గత ఏడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చింది.
జాన్సన్ & జాన్సన్ తన బేబీ పౌడర్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పిన కాలిఫోర్నియా వ్యక్తికి $18.8 మిలియన్లు చెల్లించాలని యూఎస్ కోర్టు ఆదేశించింది. దీనితో టాల్క్ ఆధారిత ఉత్పత్తులపై వేలకొద్దీ కేసులను పరిష్కరించాలని కోరుతూ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్‌డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీ చేసే చలానాలు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ఢిల్లీ లోని 20,000 వాహనాలు ఒక్కొక్కటి 100కి పైగా చలాన్లను అందుకున్నాయి. అయితే వాటి యజమానులు ఇంకా జరిమానాలు చెల్లించడానికి పట్టించుకోలేదు.
సింగపూర్ పాస్‌పోర్ట్ 192 దేశాలకు వీసా రహిత ప్రయాణంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఇది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జూలై 18న విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం గతంలో టాప్ ర్యాంక్ హోల్డర్‌గా ఉన్న జపాన్ మూడో ర్యాంక్‌కు దిగజారింది.
జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
కొలంబియాలో తూర్పు మైదానాలకు బొగోటాను కలిపే కీలకమైన హైవే పై కొండచరియలు విరిగిపడి చేరిన బురద తో 15 మంది మరణించారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో మూడు వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న ఇరవై మందికి పైగా ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
దేశంలోని ప్రతిపక్షాలు తమ ఫ్రంట్ పేరుగా 'ఇండియా'ను ప్రకటించిన ఒక రోజు తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమికి ట్యాగ్‌లైన్‌గా 'జీతేగా భారత్'ను ఎంచుకున్నారు.గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్యాగ్‌లైన్ అనేక ప్రాంతీయ భాషల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.