Home /Author anantharao b
: ఫ్రాన్స్ .. పర్యాటకులకు మరియు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి చెందిన దేశం... ఇపుడు మనుషుల రక్తాన్ని తాగే బెడ్‌బగ్స్ ను తొలగించడానికి కష్టపడుతోంది. ఇవి గత కొన్ని వారాలుగా వీటిని ప్రజలు వీటిని బట్టలు, బ్యాక్‌ప్యాక్‌లు లేదా డైనింగ్ టేబుల్‌పై - సబ్‌వేలు, సినిమా ధియేటర్స్ వద్ద చూస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పాలనా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి బుల్డోజర్ నమూనా న్యాయాన్ని అమలు చేసింది12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో అధికారులు కూల్చేసారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కారణంగా వారు పేర్కొన్నారు.
క్రికెటర్ శిఖర్ ధావన్‌ను విడిచిపెట్టిన భార్య ఏషా ధావన్ క్రూరత్వం ప్రదర్శించిందనే కారణంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం అతనికి విడాకులు మంజూరు చేసింది. ధావన్ మరియు ఏషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు.
హీరో విశాల్ నుంచి 7 లక్షలు లంచం తీసుకున్నందుకు గాను గుర్తుతెలియని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్‌సి ) ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ముగ్గురు నిందితులను మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎంలుగా గుర్తించగా, మిగతా వారి పేర్లు వెల్లడించలేదు.
కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్‌ని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపిక చేశారు.
హైదరాబాదులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నగరంలోని కూకట్ పల్లితో పాటు.. శివారు ప్రాంతాల్లోని వారి ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు వంద టీములతో ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
వివిధ రంగాల్లో ఈ ఏడాది నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తున్న స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ బుధవారంనాడు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి , లాయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లను విజేతలుగా అకాడమీ ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంజయ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితులపై ఈడీ సోదాలు చేసింది.
హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.