Home /Author anantharao b
యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను కొనసాగించారు.
గత వారం రోజుల్లో బ్రెజిల్ లోని అమెజాన్ లో 100 కు పైగా డాల్ఫిన్లు మృతిచెందాయి. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరిన్ని త్వరలో చనిపోతాయని నిపుణులు అంటున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరగుతుండగానే శంభాజీనగర్‌లోని ఘాటీ ఆసుపత్రిలో 24 గంటల్లో ఇద్దరు నవజాత శిశువులు సహా పది మంది రోగులు మరణించారు. దీనిపై శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే X లో ఇలా వ్రాశారు
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కెటిఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి సార్ అని కెటిఆర్ ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం, పోసేదెప్పుడు.. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు.? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడని నిలదీశారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగులు మరణించడంతో మరణాల సంఖ్య 31కి చేరుకుంది. వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. మొత్తంమీద ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 16 మంది శిశువులు, 15 పెద్దలు మృతి చెందారు.
వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతోంది. నవంబర్ 18, 2023న, అదుర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది.
ఉదయపూర్- జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ప్రార్థనలు చేసి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ ప్రైవసీని గౌరవించాలని పార్టీనేతలు కార్యకర్తలకు చెప్పారు.
బీహార్ ప్రభుత్వం తన వివాదాస్పద కుల ఆధారిత సర్వే వివరాలను సోమవారం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది. బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలిచే ఈ జనాభా లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 19 శాతానికి పైగా ఉండగా, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నాయి.