Home /Author anantharao b
పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన చేసింది.శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 5-1తో జపాన్ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ మహిళ నర్గీస్ మహ్మదీ దక్కించుకున్నారు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న నర్గీస్ ఇరాన్లో అణిచివేయబడుతున్న మహిళలకు తరపున మానవ హక్కులకోసం.. ప్రతి ఒక్కరికి స్వేచ్చ కోసం ఆమె పోరాడుతున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. తన గన్‌మన్‌పై చేయి చేసుకున్నారు. శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకి బొకే ఇవ్వాలనుకున్నారు.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ అక్రమ నిధుల కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి మరియు దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని పేర్కొన్నారు.
వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెస్ట్ మారేడుపల్లిలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) శుక్రవారం ప్రారంభించారు.విద్యార్థులను పలకరించిన కేటీఆర్ డైనింగ్ హాల్లో వారితో కలిసి అల్పాహారం చేశారు.
సిరియాలోని మిలిటరీ అకాడమీపై గురువారం జరిగిన డ్రోన్ల దాడిలో సుమారుగా 100 మందికి పైగా మరణించారు. సిరియా రక్షణ మంత్రి గ్రాడ్యుయేషన్ వేడుక నుండి బయలుదేరిన కొన్నినిమిషాల తర్వాత ఆయుధాలతో కూడిన డ్రోన్లు బాంబుదాడికి దిగాయని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా చేసిన రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది
బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.