Home /Author anantharao b
: ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6న సమన్లు జారీ చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూలాల ప్రకారం, రణబీర్ కపూర్ సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేసారు.
మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూనే ఉంది. నాగ్‌పూర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరతపైప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరణాలు సంభవించడం గమనార్హం.
చైనా సమీపంలోని ఎల్లో సముద్రంలో విదేశీ నౌకల కోసం రూపొందించిన ఉచ్చులో చైనా నూక్లియర్ సబ్ మెరైన్ చిక్కుకోవడంతో 55 మంది చైనా సబ్ మెరైనర్లు చనిపోయారు. యూకే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం సబ్ మెరైన్ గొలుసు ఉచ్చును ఎదుర్కొంది. సబ్ మెరైన్ యొక్క ఆక్సిజన్ వ్యవస్థలలో విపత్తు లోపం కారణంగా సబ్ మెరైనర్లు మరణించారు.
కృష్ణా జిల్లా పెడన వారాహి యాత్ర సభలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాళ్ళ దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు కదా.? దీనికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అని నోటీసుల్లో ప్రశ్నించారు. ఆధారాలుంటే ఇచ్చి పోలీసులకి సహకరించాలని పోలీసులు కోరారు.
మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు వద్ద కుంభవృష్ణి కారణంగా ఈ వరద ఏర్పడింది
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది.
2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది.
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించడం దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. అపరిశుభ్రతతో నిండిన ఆసుపత్రిలోని టాయ్‌లెట్‌ను అక్కడి డీన్ చేత కడిగించారు. అధికార శివసేన ఎంపీ. శివసేన ఎంపీ ఆదేశించడంతో డీన్ టాయిలెట్ కగడక తప్పలేదు
ఇండియాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉన్న 40 మంది రాయబారులను ఈ నెల 10 వ తేదీలోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నాడు ఓ వార్తను ప్రచురించింది. అయితే తాజా పరిణామలపై భారత ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనల విడుదల చేయాల్సి ఉంది.