Home /Author anantharao b
ఇజ్రాయెల్ లో అసహజ మరణాలకు గురైన వ్యక్తుల మృతదేహాలను వెలికితీసే జకా అనే సంస్థలో యోస్సీ అనే కార్యకర్త పనిచేస్తున్నాడు. అతను తాజాగా యుద్ద సమయంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల స్డెరోట్‌లో ఒక ఇజ్రాయెల్ మహిళ శవాన్ని తాను కనుగొన్నానని, ఆమె కడుపును చీల్చి శిశువును హమాస్ ఉగ్రవాదులు కత్తితో పొడిచి చంపారని చెప్పాడు.
ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో కనీసం 1.1 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించింది. గాజా నగర నివాసులను గాజా స్ట్రిప్ యొక్క దక్షిణ భాగంలోకి పారిపోవాలని ఆదేశించింది, హమాస్ మిలిటెంట్లు నగరం కింద సొరంగాలలో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ తరలింపు మీ భద్రత కోసమే నంటూ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ - 20 పార్లమెంటరీ సమ్మిట్ ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2023లో మొత్తం 125 దేశాలకు గాను ఇండియా 111 ర్యాంకులో నిలిచింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ నివేదకను తప్పుబడుతోంది. ఏ గణాంకాల ప్రకారం ఈ నివేదికను తయారు చేశారని ప్రశ్నించింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య వార్తలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. రాజమహేంద్రవరం కేంద్ర కరాగారంలో వసతులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖకు మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎంఓ షిఫ్టింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాటు, మంత్రుల నివాసాల కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.