Home /Author anantharao b
పూణేలోని ఎరవాడలో పోలీసులకు చెందిన 3 ఎకరాల భూమిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 2010లో వేలం వేసినట్లు పూణే మాజీ పోలీసు కమిషనర్ మీరన్ చద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ద్వారా 2జి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న బిడ్డర్‌కు ఈ భూమిని విక్రయించారని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపి ఈశ్వర్‌లాల్ జైన్‌కు సంబంధించిన పలు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలికంగా అటాచ్ చేసింది.ఎన్సీపీ మాజీ కోశాధికారిగా కూడా పనిచేసిన ఈశ్వర్‌లాల్ జైన్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు.
ఆపరేషన్ అజయ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఢిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పేరుతో కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.
టీడీపీ డ్రామాలు పీక్స్‌కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ చేసిన ట్వీట్ పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్‌పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.