Home /Author anantharao b
హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో సోమవారం తన వచ్చే మూడు నెలల్లో 750 హోటళ్లను తమ ప్లాట్ ఫామ్ లో చేరుస్తున్నట్లు తెలిపింది. గోవా, జైపూర్, ముస్సోరీ, రిషికేశ్, కత్రా, పూరీ, సిమ్లా, నైనిటాల్, ఉదయపూర్, మౌంట్ అబూ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్లో వరుసగా ఆరవ నెలలో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం ప్రతికూల స్థాయిలోనే ఉంది.సెప్టెంబర్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.26 శాతం క్షీణించింది.
గాజా పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం కావడంతో పలువురు నివాసితులు ఆసుపత్రులు మరియు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ భూ దాడులకు దిగుతుందన్న సమాచారంతో మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యలకేసులో నిందితులు సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్ ఇద్దరిని నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున వీరిద్దరిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన మిజోరంలో మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి మరియు భారత ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది. కానీ మణిపూర్లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులుతో కూడిన విద్యుత్ అలంకరణ చేశారు. ఇది ఆలయానికి అపచారం అంటూ భక్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలని సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
:ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని నిరిమ్ కిబ్బట్జ్ ప్రాంతంలో మరో సీనియర్ హమాస్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు కిబ్బట్జ్ నిరిమ్ ఊచకోతకు కారణమైన దక్షిణ ఖాన్ యునిస్లోని దళాల నుఖ్బా కమాండర్ బిల్లాల్ అల్ కేద్రాను గత రాత్రి చంపాయి.
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలు భయంతో పరుగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.