Home /Author anantharao b
తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ (సిఆర్ పార్క్)లో ఉన్న దుర్గాపూజ మండపాన్ని సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఆయనకు బెంగాలీ సంప్రదాయంలో స్వాగతం పలికారు. మండపంలో నిర్వహించిన పూజ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.
: కాకినాడ జిల్లా తాళ్ళరేవు లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి యానాం ప్రాంతానికి ఈ ఏడుగురు యువకులు విహార యాత్రకి వచ్చారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.