Home /Author anantharao b
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ను నేషనల్ ఐకాన్ గా నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం అతడిని అధికారికంగా నియమించనున్నారు. ఎన్నికలలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఎన్నికల కమీషన్ పలువురు ప్రముఖలను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తోంది. దీనిలో భాగంగానే రాజ్ కుమార్ రావు నియామకం జరగనుంది.
జైలర్ నటుడు వినాయకన్‌ను కేరళలోని ఎర్నాకులం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించి, మద్యం మత్తులో బెదిరింపులు మరియు మాటలతో దూషించినందుకు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్యానెల్ తన పుస్తకాలపై ఇండియాకు బదులుగా 'భారత్' అని ముద్రించాలనే ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్యానెల్ సభ్యులలో ఒకరైన ఇస్సాక్ చెప్పిన దాని ప్రకారం, కొత్త NCERT పుస్తకాలు పేరు మార్పును కలిగి ఉంటాయి.
: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా అలయ్ బలయ్ వేడుక ఘనంగా జరుగుతోంది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం సాగుతోంది.
గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గత 24 గంటల్లో 700 మంది మరణించారు. మరోవైపు గాజాలో విద్యుత్హ కొరణంగా ఆసుపత్రుల్లో వైద్యనదుపాయాలు నిలిచిపోయాయని దీనితో మరిన్ని మరణాలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.
ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లోని ఈశాన్య కిషోర్‌గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో సోమవారం 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.రాజధాని ఢాకాకు 60 కిలోమీటర్ల దూరంలోని కిషోర్‌గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢాకా వెళ్లే ఎగరోసిందూర్ గోధూలీ ఎక్స్‌ప్రెస్ వెనుక కోచ్‌లను ఛటోగ్రాం వైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆంధప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకింది. ఫలితంగా వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయి. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలుగా ఉంది. జరిగిన దాన్ని గమనించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలని మాయం చేసేందుకు ప్రయత్నించారు.