AP Secretariat: ఏపీ సెక్రటేరియట్ లో ఈ-ఆఫీస్‌ను స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఏపీలో ప్రభుత్వం మారనుండడంతో కీలక పైళ్ల పై రాబోయే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది .తెలంగాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లుంది .
AP Secretariat: ఏపీలో ప్రభుత్వం మారనుండడంతో కీలక పైళ్ల పై రాబోయే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది .తెలంగాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లుంది .బుధవారం ఉదయం అడిషనల్ ఎస్పీ ప్రకాష్ నేతృత్వంలో ఐటి శాఖలో తనిఖీలు జరుగుతున్నాయి .ఐటి శాఖ నుంచి కొన్ని కీలక ఫైళ్లు ,సమాచారం బయటికి వెళుతుందని సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది .ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ-ఆఫీస్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి లాగిన్ ఐడీలు క్లోజ్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన ఫైళ్లు ఈ-ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీమ్‌లు రంగంలోకి దిగారు.
లాప్ టాప్ ల మాయం ( AP Secretariat)
ఈ క్రమంలో వారం రోజుల నుంచి జరిగిన ఫైళ్ల కదలికలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కొన్ని శాఖల అధికారులు ఫైళ్లు చించి వేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫైళ్లను ముక్కలు ముక్కలుగా చింపేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ-ఆఫీస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను సైతం పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల నుంచి కాపాడుకునేందుకే ఫైళ్లు చింపివేస్తూ, మాయం చేస్తున్నారని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వారికి భయం పట్టుకుందన్నారు. తప్పులు బయటపడతాయని వారికి తెలుసని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.లాప్ టాప్ లు కూడా కొన్ని బయటకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది .