TDP Yatras: ఇక జోరుగా టిడిపి యాత్రలు.. రాష్ట్రమంతా పర్యటించనున్న భువనేశ్వరి, లోకేష్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీంతో పార్టీలో పునరుత్తేజం నింపేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ యాత్రలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
TDP Yatras: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీంతో పార్టీలో పునరుత్తేజం నింపేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ యాత్రలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
నిజం గెలవాలి..(TDP Yatras)
దీనిలో భాగంగా నిజం గెలవాలి పేరుతో పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. వచ్చే వారంనుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి. చంద్రబాబు అరెస్టయిన తరువాత ఆందోళనకు గురయిన 105 మంది పార్టీ అభిమానులు, నేతలు మరణించారని వారి కుటుంబాలను కలిసి ఓదార్చుతామని భువనేశ్వరి ఇంతకు ముందే తెలిపారు. ఇపుడు ఈ దిశగా కార్యాచరణకు రంగం సిద్దమయింది.
భవిష్యత్తుకు గ్యారెంటీ ..
చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇంతకుముందు చంద్రబాబు ఈ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇప్పుడాయన జైల్లో ఉన్నందున చంద్రబాబు స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్.. చంద్రబాబు జైలు నుంచి రాగానే పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు. వాస్తవానికి యువగళం యాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావించారు. అయితే ఢిల్లీ, విజయవాడ కోర్టులో చంద్రబాబు కేసుల విచారణ జరుగుతుండటంతో లాయర్లతో సందప్రదించవలసిన అవసరం ఏర్పడింది.దీనితో యాత్రకు విరామం ఇచ్చారు. ఇపుడు భవిష్యత్తుకు గ్యారంటీతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.