Vinayaka Laddu Auctions : వేలం పాటలో రికార్డు ధర పలుకుతున్న వినాయక లడ్డూలు.. హైదరాబాద్లో 1.26 కోట్లు !
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
Vinayaka Laddu Auctions : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
రిచ్మండ్ విల్లాలో.. 1.26 కోట్ల ధర
గణేశ్ ఉత్సవాల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం లడ్డూ వేలంపాట. గణనాథుడి లడ్డూను దక్కించుకోవటాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. తమ బంధుమిత్రులకు ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఈ క్రమంలో లడ్డూను దక్కించుకునేందుకు కొందరు లక్షలాది రూపాయలు వెచ్చించేందుకైనా వెనుకాడరు. లడ్డూకోసం పోటాపోటీగా వేలం పాటలు జరుగుతాయి. అయితే, హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రిచ్మండ్ విల్లాలో వినాయకుని లడ్డూకు భారీ ధర పలికింది. ఏకంగా రూ. 1.26కోట్లకు ఇక్కడి లడ్డూను వేలంపాటలో అసోసియేషన్ ప్రతినిధులు దక్కించుకున్నారు. లడ్డూధర ఇంత భారీ మొత్తంలో పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది.
మై హోమ్ భుజా కమ్యూనిటీలో.. రూ.25.50లక్షలు
మరోవైపు హైదరాబాద్లోని మై హోమ్ భుజా కమ్యూనిటీలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాటకు అనూహ్య స్పందన వచ్చింది. లక్ష రూపాయలతో ప్రారంభమైన ఈ వేలంపాట ఏకంగా రూ.25.50లక్షలు పలికింది. ఈ లడ్డూను రియల్టర్ చిరంజీవి గౌడ్ దక్కించుకున్నాడు. వరుసగా మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ లడ్డూ వేలంపాటలో ఇదే అత్యధిక ధర. గతేడాది వేలంపాటలో లడ్డూకు రూ.20లక్షల 50వేలు పలకగా.. అంతకుముందు ఏడాదిలో రూ.18లక్షల 50వేలు దాటింది.