Last Updated:

Adipurush : దేశ ప్రజలకు బుర్ర, బుద్ధి లేదని అనుకుంటున్నారా? అని ‘ఆదిపురుష్’ టీంపై మండిపడ్డ అలహాబాద్ హైకోర్టు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు

Adipurush : దేశ ప్రజలకు బుర్ర, బుద్ధి లేదని అనుకుంటున్నారా? అని ‘ఆదిపురుష్’ టీంపై మండిపడ్డ అలహాబాద్ హైకోర్టు..

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Adipurush).. మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ను అందుకొని కలెక్షన్ల పరంగా కొద్ది రోజులు బాగానే దూసుకుపోయినా.. ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు కష్టం అవుతుంది.

అయితే ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. సినిమా స్క్రీన్‌ప్లే, అందులోని డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే సినిమాను నిలిపివేయాలని కోరింది. మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన హైకోర్టు జడ్జిలు జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాశ్ సింగ్.. సినిమా దర్శకనిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది రామాయణ గాథ కాదని దర్శకనిర్మాతలు పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఉన్నట్టు చూపించి.. ఇది రామాయణం కాదని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు బుర్ర, బుద్ధి లేదని అనుకుంటున్నారా? అని వ్యాఖ్యానించింది. సినిమాలోని అభ్యంతరకర డైలాగులకు ఓకే చెప్పిన సెన్సార్ బోర్డుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంతాసీర్ శుక్లా పేరును కూడా పిటిషన్ లో జోడించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఆదిపురుష్ మంచి ఓపినింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. కానీ రానురాను ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇదిలా ఉంటే పట్టుమని రెండు వారాలు కూడా కాకముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఆదిపురుష్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున ఓటీటీలో రిలీజ్ చేయనున్నారన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారు మూవీ మేకర్స్.