Air India passengers: ఒకే గదిలో నేలమీద 20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.
Air India passengers: ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీకి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారిని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు తరలించారని ప్రయాణికులు చెబుతున్నారు.
తిండి తినలేక, భాష అర్దం గాక..(Air India passengers)
కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించిచారు. అక్కడ లభించే విభిన్న ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే..దీనికి తోడు అక్కడ భాష అస్సలు అర్థం గాక మరింత గందగోళంగా పరిస్థితి తయరైందని ప్రయాణికులు వాపోతున్నారు. పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికుడు తాజా పరిణామాలపై స్పందించారు. తమకు ఓ కళాశాల హాస్టల్‌లో వసతి కల్పించారు. అక్కడ వైఫై అందుబాటులో ఉండటంతో తమ కుటుంబాలతో టచ్‌లో ఉండగలిగామని చెప్పుకొచ్చారు.
ముంబై నుంచి ప్రత్యేక విమానం..
మరికొంతమంది ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. , ఒకే గదిలో 20 మంది నిద్రించాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిక్కుకుపోయిన ప్రయాణికులను మగడాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించడానికి ముంబై నుంచి ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. విమానాయన సంస్థ ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తున్నామని, వారందరికీ హాస్టళ్లు, హోటళ్లలో వసతి కల్పించామని పేర్కొంది. కాగా, ఎయిర్ ఇండియా మగడాన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. కాగా ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూపు చేతిలో ఉన్న విషయం తెలిసిందే.