crocodiles Attack: వృధ్దుడిపై దాడి చేసి ముక్కలుగా చేసిన 40 మొసళ్లు.. ఎక్కడో తెలుసా?
కంబోడియా కు చెందిన ఒక వ్యక్తిని 40 మొసళ్లు చంపాయని పోలీసులు తెలిపారు. లువాన్ నామ్, (72),తమ కుటుంబానికి చెందిన మొసళ్ల ఫాంలో గుడ్లు పెట్టిన బోనులోంచి మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతను గోడ్గా ఉపయోగిస్తున్న కర్రను పట్టుకుని మొసలి లోపలికి లాగింది. దీనితో అతను పట్టు తప్పి లోపలకు పడిపోయాడు.
crocodiles Attack: కంబోడియా కు చెందిన ఒక వ్యక్తిని 40 మొసళ్లు చంపాయని పోలీసులు తెలిపారు. లువాన్ నామ్, (72),తమ కుటుంబానికి చెందిన మొసళ్ల ఫాంలో గుడ్లు పెట్టిన బోనులోంచి మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతను గోడ్గా ఉపయోగిస్తున్న కర్రను పట్టుకుని మొసలి లోపలికి లాగింది. దీనితో అతను పట్టు తప్పి లోపలకు పడిపోయాడు.
మొసళ్ల రైతుల సంఘం అధ్యక్షుడు..(crocodiles Attack)
దీనితో 40 మొసళ్లు అతని చుట్టూ చనిపోయే వరకు దాడి చేసాయి. అతని చేరి శరీరాన్ని ముక్కలు చేసాయి. అతని పొలం వద్ద ఉన్న కాంక్రీట్ఆవరణ అంతా రక్తంతో తడిసిపోయింది.
వ్యక్తి యొక్క ఒక చేయి మొసళ్లు కొరికి మింగినట్లు సియొమ్ రీప్ కమ్యూన్ యొక్క పోలీసు చీఫ్ మేయ్ సావ్రీ తెలిపారు.లువాన్ నామ్ స్థానిక మొసళ్ల రైతుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు, మొసళ్ల పెంపకాన్ని నిలిపివేయాలని అతని కుటుంబం అతడిని సంవత్సరాల తరబడి కోరుతోందన్నారు. అందువలన ఇపుడు అతని కుటుంబం వాటిని అమ్మివేసే అవకాశం ఉందన్నారు.
2019లో అదే గ్రామంలోని తన కుటుంబ మొసళ్ల ఫారంలోకి వెళ్లిన రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తిన్నాయని పోలీసు చీఫ్ తెలిపారు.సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్ల ఫాంలు ఉన్నాయి. మొసళ్ల గుడ్లు, తోలు, మాంసం కోసం వీటిని ఫాంలలో పెంచుతారు.