Last Updated:

Oke Oka Jeevitham Movie review: ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ చూసేద్దామా

Oke Oka Jeevitham Movie review: ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ చూసేద్దామా

Cast & Crew

  • Sharwanand (Hero)
  • Ritu Varma (Heroine)
  • Amala Akkineni, Priyadarshi, Vennela Kishore, Nassar (Cast)
  • Shree Karthick (Director)
  • Dream Warrior Pictures (Producer)
  • Jakes Bejoy (Music)
  • (Cinematography)
3

Tollywood: జీవితం ఒక్కటే. మంచీచెడు అన్నింటినీ అనుభవిస్తూ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రతి రోజునీ ఆనందంగా గడుపుతూ ముందుకు సాగాలన్నదే ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా టైమ్ ట్రావెల్‌ క‌థతో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. శ‌ర్వానంద్‌, అమ‌ల తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దామా..

అసలు కథేంటంటే: శ‌ర్వానంద్‌, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి ఈ చిత్రంలో ఆది, శ్రీను, చైతుల పాత్రల్లో నటిస్తారు. కాగా వారు చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. వీరు ముగ్గురూ అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కాగా మధ్యలో వీరికి పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం అనేక పరిశోధనలు చేస్తుంటారు. ఆఖరికి పాల్ క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌ సహాయంతో గ‌తంలోకి వెళ్లే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిచేసుకున్నారా? లేక భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకుంటారా, విధి వారికి ఏవిధమైన సమాధానం చెప్పింద‌నేది కథ.

హత్తుకుపోయే సన్నివేశాలు: ఆది, శ్రీను, చైతూల పాత్రల‌ని ప‌రిచ‌యం చేస్తూ క‌థ‌ మొదలవుతుంది. కాగా ఈ సినిమాలో హాస్యంతో కూడిన స‌న్నివేశాల్ని కూడా చిత్రించాడు డైరెక్టర్. బ్రేక్ తర్వాత వ‌చ్చే టైం మెషీన్ స‌న్నివేశాలు ఎవరూ ఊహించ‌ని విధంగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో పూర్తిగా భావోద్వేగాలే ప్రధానంగా సినిమా సాగుతుంది. అమ్మ ప్రేమ‌ని పొంద‌డం కోసం ఆది ఎంతగా పరితపిస్తుంటాడో చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకోక మానరు. గ‌తంలోకి వెళ్లి త‌న అమ్మానాన్నలు, ఇల్లుని చూసుకోవ‌డం, అమ్మ చేతి వంట రుచి చూడటం వంటి స‌న్నివేశాలు సినిమా చూస్తున్నవారిని ఎంతగానో హ‌త్తుకుంటాయి.

పాత్రల్లో ఒదిగిపోయారు: శ‌ర్వానంద్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి తమతమ పాత్రలకు జీవం పోశారనే చెప్పుకోవాలి. శ‌ర్వానంద్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే స‌న్నివేశాల్లో శర్వాలో ఎంత గొప్ప న‌టుడు ఉన్నాడో అనిపిస్తుంది. ఇంక చాలా కాలం త‌ర్వాత అమల తెర‌పై ఓ బ‌ల‌మైన పాత్రలో కనిపించారు. ఇది ఆమె కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. మరి నాజర్ విషయానికొస్తే అద్భుతంగా నటించారనే చెప్పవచ్చు. జేక్స్ బిజోయ్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది.

మొత్తంగా ఆదిత్య 369, 24, బింబిసార వంటి ట్రైమ్ ట్రావెల్ కథలకు భిన్నంగా భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో అమ్మ ప్రేమను చూపుతూ కాలప్రయాణం చెయ్యడాన్ని దర్శకుడు శ్రీకార్తిక్ అద్భుతంగా ఆవిష్కరించారనే చెప్పవచ్చు.

ఇదీ చదవండి: రంగరంగవైభవంగా సినిమా రివ్యూ

ఇవి కూడా చదవండి: