Adilabad govt hospital: ఆసుపత్రిలో పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్

BreakingNews: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి బెడ్ పై ఉన్న పసికందుపై సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. ఘటనలో శిశువుతో పాటు తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గుడిహత్నూరు ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో చోటుచేసుకుంది. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ ఆస్పత్రిలో ప్రసవించింది. ఇవాళ ఉదయం తల్లీ బిడ్డ బెడ్‌పై ఉండగానే ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడి వారిపై పడింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. శిశువుకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సీలింగ్ ఫ్యాన్ తెగిపడటంతో…..రోగులు మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.