Breaking News: పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు

Police case on padi kaushik reddy abuse on minister seethakka: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో బెయిల్ మంజూరైన తర్వాత.. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటే.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
వరంగల్ ఎమ్మెల్యేల బట్టలూడదీస్తానని కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువలన కౌశిక్ రెడ్డిపై ఆయనకు సహకరించిన ఎర్రెబెల్లి దయాకర్ రావుపై , వినోద్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్ లను విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.