Published On:

Monsoon Effect On Food: మిగిలిపోయిన ఆహారాన్ని వర్షాకాలంలో తింటే ఇవి తప్పవు.!

Monsoon Effect On Food: మిగిలిపోయిన ఆహారాన్ని వర్షాకాలంలో తింటే ఇవి తప్పవు.!

 

Monsoon Health Tips: వర్షాకాలంలో మిగిలిపోయిన ఆహారాన్ని లేక నిన్నటి ఆహారాన్ని ఫ్రిడ్జ్ లలో నిల్వఉన్న ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ప్రమాదం. వర్షాకాలంలో మామూలుగా వాతావరణం చల్లగా ఉంటుంది. తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహారం ఎక్కువసేపు నిల్లఉంచినా అనగా ఈరోజు ఆహారం రేపటి ఉదయం వరకు ఉన్నా వాసన రాకపోవచ్చు. అయితే అది వాసన రాకపోయినా చెడిపోతుందని అంటున్నారు నిపుణులు. అందులో సూక్ష్మజీవులు పెరిగిపోతాయని ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన జీర్ణక్రియమీద చాలా ఎఫెక్ట్ చూపెడుతుందని అంటున్నారు.

పాతకాలం నుంచి భారతదేశంలో ఆహారాన్ని కడుపులో అరిగించే క్రమాన్ని జీర్ణాగ్ని అని పిలిచేవారు. శరీరంలోపల అగ్ని ఆహారాన్ని అతిగించడంతోపాటు ప్రాణాన్ని నిలబెడుతుందని నానుడి. అందులో భాగంగానే నేటి నిపుణులు కూడా వర్షాకాలంలో శరీరంలోని వేడి కాస్త మందగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనివలన జీర్ణక్రియ నెమ్మదిస్తుందని, ఎంజైమ్ ల ప్రభావం తగ్గడం, ప్రేగులలో సున్నితత్వం పెరుగుతుంది. ఈ పరిస్థితులలో చల్లారిన లేక చాలా సేపు ఉంచిన ఆహారాన్ని తినడం జీర్ణక్రియకు మంచిది కాదని అంటున్నారు. వేడి వేడిగా అప్పుడే చేసిన ఆహారాన్నే భోజనంలో భాగం చేయడం ముఖ్యమని తెలిపారు.

రాత్రి మిగిలిపోయిన ఆహారం ఏమవుతుందంటే
రాత్రి మిగిలిపోయిన ఆహారంలో శక్తి తగ్గుతుంది. ఆహారంపై తేమ పెరుగుతుంది. సూక్ష్మజీవులు అధికమవుతాయి. కనిపించడం, వాసన బాగానే ఉన్నా తినడానికి ఆరోగ్యకరం కాదు. మిగిలిపోయిన వాటిని వేడి చేసుకుని తిన్నా ప్రమాదమే. ఒక వేల తినాలనుకుంటే 24గంటల లోపు ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒక రోజు నిల్వచేయాలనుకుంటే మాత్రం ప్లాస్టిక్ కాకుండా స్టీల్, గాజు పాత్రలను ఎంచుకోండి.

ఆహారాన్ని అనేకసార్లు వేడిచేయకుండా ఉండాలి. ఒకసారి మీరు వేడిచేస్తే అప్పుడే తినేయాలి. మళ్లీ రెండు మూడు సార్లు వేడిచేయడం ఆరోగ్యానికి హానికరం. ఒక వేల నిన్నటి ఆహారాన్ని వేడి చేసుకుని తంటున్నప్పుడు దానిలో అల్లం రసాన్ని కానీ, నిమ్మకాయ రసాన్ని కానీ పిండుకోవాలి. ఇది జీర్ణక్రియను కాపాడుతుంది. వర్షాకాలంలో పిల్లలు, ముసలి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వీరికి అప్పుడే చేసిన వేడి వేడి ఆహారాన్ని ఇవ్వడమే మంచిది.

 

 

ఇవి కూడా చదవండి: